ఆదివారం 12 జూలై 2020
National - Jun 21, 2020 , 08:41:22

15వ రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

15వ రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌: దేశంలో  పెట్రో, డీజిల్‌ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం 15వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి.

పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు, డీజిల్‌ 56 పైసలు పెంచాయి. గడిచిన 15 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌కు రూ.8.03 పైసలు, డీజిల్‌ రూ. 8.27పైసలు పెరిగాయి. పెంచిన  ధరల ప్రకారం చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.27 పైసలు, ఢిల్లీలో 78.88 పైసలు, కోల్‌కతా రూ. 80.62, ముంబైలో 85.70, హైదరాబాద్‌లో రూ.81.88 పైసలకు చేరుకున్నాయి. 

చెన్నైలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.75.29 పైసలు, ఢిల్లీలో 77.67, కోల్‌కతాలో 73.07, ముంబైలో 76.11, హైదరాబాద్‌లో రూ.75.91 పైసలకు  చేరుకున్నాయి. 


logo