శనివారం 11 జూలై 2020
National - Jun 21, 2020 , 01:04:40

సూర్యగ్రహణం- రాశులు వాటి ప్రభావాలు

  సూర్యగ్రహణం- రాశులు వాటి ప్రభావాలు

ఢిల్లీ : సూర్యగ్రహణం అమెరికా, కెనడా, నైరుతి ఇంగ్లాండ్, బెల్జియం, ఇటలీ, వేల్స్, దిగువ ఈజిప్టు, అర్మేనియా లాంటి దేశాల్లో మిథున రాశిలో ఏర్పడనుంది. స్పెయిన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ధనుస్సు రాశిలో ఏర్పడనుంది… ఈ గ్రహణం వల్ల ప్రతికూల శక్తి ఉద్భవిస్తుంది. జూన్ 21 మధ్యాహ్నం 1.00 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఈ నెగిటీవ్ ఎనర్జీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. భారత్, చైనా, అమెరికా దేశాల్లో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా అమెరికాలో రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతను పెంచుతుందని చెప్తున్నారు జ్యోతిష్యులు..అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ కుండలి సింహ రాశి అవటంతో ఇది మరింత తీవ్ర ప్రభావాల్ని చూపనుంది.

జూన్ 15-30 మధ్య కాలంలో అమెరికా అంతర్గత, బాహ్య సంఘర్షణలను ఎదుర్కొంటుంది. స్థానిక స్థాయిలో నేరాలు పెరుగుతాయి.. సాయుధ దళాల మోహరింపులకు దారితీస్తుంది.. అమెరికా ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించకపోతే విస్తృతమైన జాతీయ సంక్షోభం తలెత్తుతుంది. ఈ సూర్యగ్రహణం అమెరికా-చైనా సంబంధాలపైనా ప్రభావాన్ని చూపనున్నది.  జ్యోతిషశాస్త్రం ప్రకారం చైనా జాతక పరిశీలనలో ఆరవపాదంలో  ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చైనా, అమెరికా రెండు దేశాలు శని ప్రభావానికి లోనవుతాయి. ఇది ఆర్థిక, రాజకీయ సంబంధాలకు అనుకూలంగా ఉండదని తెలుస్తుంది. ఇది సాధారణ ప్రజలకు సమస్యలను కలిగిస్తుంది. ఇక జూన్ 15 నుంచి అక్టోబరు చివరి మధ్య కాలంలో చైనా,అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొననున్నాయి. దాదాపు  ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. 


logo