శుక్రవారం 10 జూలై 2020
National - Jun 20, 2020 , 23:38:28

యోగాడే మెసేజ్ ఇచ్చిన సెలబ్రెటీస్

   యోగాడే  మెసేజ్ ఇచ్చిన సెలబ్రెటీస్

ముంబై : ఆరోగ్యం , సంక్షేమం పట్ల సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిజరుపుతారని బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్య నేపథ్యాన్ని యోగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనస్సు, ధృడమైన శరీరం దీనిలో భాగంగా ఉంటాయి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  ఆమె మెసేజ్ ఇచ్చారు. యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. కేవలం యోగా ద్వారానే కాకుండా ఆరోగ్యానికి పోషకాహారం చాలా అవసరం. అందుకు ప్రతి ఒక్కరూ తమ డైట్‌ను సైతం మెరుగు పరుచుకోవాలి.

బాదముల్లో విటమిన్ బీ12, మెగ్నీషియం ఫాస్పరస్ తదితర పోషకాలూ ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఇవి సహాయపడతాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాల్సిన ఆవశ్యకతను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ "అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాయామ మార్గం యోగా. ఇది శరీరం మీద మాత్రమే గాక మనస్సు మీద కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మా యోగా సాధనను కాంప్లిమెంట్ చేస్తూ నేను సైతం ఆరోగ్యవంతమైన డైట్‌ను అనుసరిస్తున్నాను"అని అన్నారు. నేనూ ప్రతి రోజూ గుప్పెడు బాదంలు  తీసుకోవడమూ చేస్తుంటాను. బాదములను సాత్విక ఆహారంగా భావిస్తుంటారు. వీటిలో అత్యంత కీలకమైన పోషకాలైన ప్రొటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం మొదలైనవి ఉన్నాయి. అదనంగా, బాదములు శక్తిని సైతం అందిస్తాయి.

ఆయుర్వేద ప్రకారం శరీర కణజాల టోనింగ్‌కు ఇవి సహాయపడతాయి'' అని సోహా అలీఖాన్  అన్నారు. "యోగా శక్తిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కానీ, సరైన రీతిలో దానిని సాధన చేస్తూనే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే చేసిన వ్యాయామాల ప్రయోజనాలు పొందగలుగుతామని" ఫిట్‌నెస్ ఎక్స్ పర్ట్ సూపర్‌మోడల్ మిలింద్ సోమన్ అన్నారు.  ఫ్రైడ్ స్నాక్స్ లేదంటే అనారోగ్యవంతమైన ఆహారానికి బదులుగా ఆరోగ్యకర మైన ఆహారం బాదములు తీసుకోవడానికి నేను ప్రాధాన్యతనిస్తుంటాను. బాదములు తేలికైనవి, సులభంగా తీసుకువెళ్లదగినవి. తినడానికి అత్యుత్తమ స్నాక్‌గా వీటని మలుచుకోవచ్చు'' అని అన్నారు.



logo