శనివారం 11 జూలై 2020
National - Jun 20, 2020 , 22:55:06

డయానా పాత్రలో క్రిస్టెన్‌ స్టెవార్ట్‌

డయానా పాత్రలో క్రిస్టెన్‌ స్టెవార్ట్‌

అమరావతి : ముప్పై ఏండ్ల వయసున్న క్రిస్టెన్‌ స్టెవార్ట్‌ సరికొత్త పాత్ర చేయనున్నది.  డయానా 30 ఏండ్ల వయసు పాత్రలో ఆమె కనిపించనున్నది. చిలీ దర్శకుడు పాబ్లో లారెయిన్‌ తీస్తున్న ‘స్పెన్సర్‌’ అనే చిత్రంలో క్రిస్టెన్‌ కథానాయికగా నటిస్తున్నారు. 20 ఏండ్ల వయసులో ప్రిన్స్‌ చార్లెస్‌తో డయానాకు పెండ్లయింది. తర్వాత పదేండ్ల కన్నా తక్కువ కాలంలోనే భర్తతో మానసికంగా ఆమె బంధం తెగిపోయింది.   బ్రిటన్‌ యువరాణిగా అభినయించనున్న ఈ అమెరికన్‌ నటి తన అత్యద్భుతమైన ప్రదర్శనను అలవోకగా చేయగలదని లారెయిన్‌ నమ్ముతున్నారు. బహుశా ఆ నమ్మకం రెండు కారణాల వల్ల ఆయనకు కలిగి వుండొచ్చు. ఒకటి స్టీవెన్‌ నైట్‌ స్క్రిప్టు ఇంకోటి క్రిస్టెన్‌ నవ్వు. ఆమె నవ్వితే అచ్చు నవ్వీనవ్వకుండా డయానా నవ్వినట్లే ఉంటుంది.logo