సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 17:20:07

జీ తెలుగులో జూన్‌ 22 నుంచి ప్రసారం కానున్నసీరియల్స్

  జీ తెలుగులో జూన్‌ 22 నుంచి ప్రసారం కానున్నసీరియల్స్

హైదరాబాద్: లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని రోజులకే అన్ని చానళ్ల లో సీరియళ్లు ప్రసారం కాలేదు. ఇటీవల షూటింగ్ జరుపుకున్న సీరియళ్లు  పునః ప్రారంభమవ్వనున్నాయి. జీ తెలుగు చానల్లో సరికొత్తగా జూన్‌ 22 నుంచి ప్రసారం కానున్నాయి. ఈ  సోమవారం నుంచి సరికొత్త బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి  జీ తెలుగు సిద్ధమైంది. రేణు దేశాయ్‌, సునయన, మంగ్లి, ప్రియదర్శి వంటి వారితో సరికొత్త వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు ముందుకు రాబోతున్నది.  రేణూదేశాయ్ ,మంగ్లి , ప్రియదర్శి నటించిన ప్రోమోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

వారికోసం సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే సీరియల్స్‌ రీక్యాప్‌ , ప్రీ క్యాప్‌ని కూడా అందించబోతున్నారు. జీ తెలుగు సీరియల్స్‌ ప్రసారమయ్యే సమయాలు .... బంగారు గాజులు సాయంత్రం 6 గంటలకు, అక్కా చెల్లెళ్లు సాయంత్రం 6.30లకు, రాధమ్మ కూతురు రాత్రి 7 గంటలకు, రామ సక్కని సీత రాత్రి 7.30లకు, నెంబర్‌ వన్‌ కోడలు రాత్రి 8 గంటలకు, త్రినయని రాత్రి 8.30లకు, ప్రేమ ఎంత మధురం రాత్రి 9 గంటలకు, కల్యాణ వైభోగమే రాత్రి 9.30లకు, సూర్యకాంతం రాత్రి 10 గంటలకు ప్రసారం కానున్నాయి. ఇక మాటే మంత్రం, రక్త సంబంధం, గుండమ్మ కథ, నిన్నే పెళ్లాడతా, తూర్పు పడమర సీరియల్స్‌ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు ప్రసారం అవుతాయి.


logo