సోమవారం 13 జూలై 2020
National - Jun 19, 2020 , 13:44:37

కరోనా ఎఫెక్ట్ : ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్

  కరోనా ఎఫెక్ట్ : ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్

హైదరాబాద్:  కరోనా మహమ్మారి జనాల జీవనవిధానాన్ని మార్చేవేసింది. కోవిడ్ నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. దీంతో స్వీయరక్షణ పద్ధతులను పాటించాల్సి వస్తున్నది. బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు, హ్యాండ్ గ్లౌజ్ లు ,ఫేస్ షీల్డ్ అందరి లైఫ్ స్టైల్ లో భాగమయ్యాయి. దీంతో ప్రముఖ ఈ- కామర్స్ సంస్థలు వినూత్న ఆఫర్లను అందిస్తున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి. సూరత్‌లో చీరల వ్యాపారం కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నారు. చీర కొంటే కరోనా కిట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే అదే బాటలో మరొక సంస్థ పయనిస్తున్నది. "ఫ్యాషన్ బీస్" అనే ఈ కామర్స్ సంస్థ మ్యాచింగ్ మాస్కులను అందిస్తున్నది. 10ఏండ్ల చిన్నారుల నుంచి 70 ఏండ్ల వృద్ధుల వరకూ వారికి తగిన సైజుల్లో, ప్యాంటు,షర్టులతోపాటు మ్యాచింగ్ అయ్యే మాస్కులను అందిస్తున్నది. కరోనా కారణంగా మ్యాచింగ్ ట్రెండ్ మారింది. ఈ సరికొత్త ట్రెండ్ ఇప్పుడు వస్త్ర ప్రపంచమంతా పాకుతున్నది. షర్టులతోపాటు ఆయా రంగులతో మ్యాచ్ అయ్యే మాస్కులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 


logo