ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 23:53:11

రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐస్ క్రీమ్ లు

రోగనిరోధక శక్తిని పెంపొందించే ఐస్ క్రీమ్ లు

ఢిల్లీ : ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ డెయిరీ డే సరికొత్త ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లను అందించేందుకు సిద్ధమైంది . "డెయిరీ డే ప్లస్ "పేరుతో రోగనిరోధకశక్తిని పెంపొందించే దినుసులు కలిగిన ఐస్ క్రీంల ప్రత్యేక శ్రేణిని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, పాండిచ్చేరిల్లో విస్తృతమైన ఉనికి కలిగిన డెయిరీ డే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇమ్మ్యూనిటీ పవర్ ను అందించడానికి ముందుకొచ్చింది. డెయిరీ డే ప్లస్ శ్రేణిలో మొదటగా రెండు కొత్త రుచులు, హల్దీ (పసుపు) ఐస్ క్రీం, చ్యవన్‪ప్రాశ ఐస్ క్రీంలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.  

హల్దీ (పసుపు) ఐస్ క్రీంలో రోగనిరోధకతని పెంపొందించే మూడు ప్రధాన దినుసులైన - పసుపు, మిరియాలు, తేనె - వుంటాయి, చ్యవవన్‪ప్రాశ ఐస్ క్రీంలో వినియోగదారులు ఆమ్లా (ఉసిరికాయ), ఖజ్జూరాలు, తేనె కలిసిన గొప్ప రుచిని ఆస్వాదించొచ్చు. పాలలోని మంచి గుణాలతోపాటు ఈ దినుసులు మీ రోగనిరోధకశక్తిని పెంపొందించుకోడానికి దోహదపడతాయి. ఎటువంటి కృత్రిమ రుచులు, కృత్రిమ రంగులు జతచేయకుండానే డెయిరీ డే ఈ పసుపు, చ్యవన్‪ప్రాశ ఐస్ క్రీంలను రూపొందిస్తున్నది. ‬‬‬‬‬‬‬‬‬‬“ఆహార భద్రత, పరిశుభ్రత విషయాల్లో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ సరికొత్త రుచులను  అందించడంలో డెయిరీ డే పేరుపొందిందని డెయిరీ డే సహ వ్యవస్థాపకుడు, ఎం.ఎన్. జగనాథ్ తెలిపారు.   


logo