గురువారం 09 జూలై 2020
National - Jun 18, 2020 , 21:18:30

పంటల సస్యరక్షణ కోసం "ఇ -ప్లాంట్ డాక్టర్"

పంటల సస్యరక్షణ కోసం

చెన్నై:లాక్ డౌన్ కారణంగా ఎక్కడి సేవలు అక్కడే ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించే  రైతులు వ్యవసాయాధికారుల నుంచి సేవలు పొందలేకపోతున్నారు. అటువంటి వారికి సరైన సలహాలూ, సూచనలూ అందించేందుకు శాస్త్రవేత్త డాక్టర్ పి సెంథిల్ కుమార్  వినూత్న విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఆన్ లైన్ ద్వారా అన్నదాతల సమస్యలకు పరిష్కారాలను అందించాలనుకున్నారు. అందులో భాగంగా తమిళనాడులోని పుదుక్కొట్టై పట్టణంలో ఎం ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) వద్ద  "ఇ -ప్లాంట్ డాక్టర్" పేరుతో రైతులకు అవసరమైన సేవలందించడానికి సిద్ధమయ్యారు. ముందుగా కొంతమంది అన్నదాతలకు ఆన్ లైన్ సేవలను అందించే విధానం పై అవగాహన కల్పించారు. 

 తెగుళ్లకు గురైన పంటల చిత్రాలు లేదా వీడియోల ద్వారా పరిస్థితిని  తెలుసుకొని వాటికి పరిష్కారాలను సూచిస్తారు . ఇదే విధంగా  ఎటువంటి పంటకైనా చిటికెలో ఆయా సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నారు . లాక్ డౌన్ నేపథ్యంలో  "ఇ -ప్లాంట్ డాక్టర్" సేవలు తమిళనాడుతోపాటు ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలోని గ్రామాలకు చెందిన రైతులకు అందించారు. పూల పెంపకం, పండ్ల తోటలు, కూరగాయల సాగుపై మారుమూల ప్రాంతాల్లోని అన్నదాతలకు ఆన్ లైన్ ద్వారా సేవలు అందిస్తున్నారు డాక్టర్ పి సెంథిల్ కుమార్. logo