శనివారం 11 జూలై 2020
National - Jun 18, 2020 , 00:37:03

శారీ కొనండి..”కరోనా కిట్లు” ఉచితంగా పొందండి...

శారీ కొనండి..”కరోనా కిట్లు” ఉచితంగా పొందండి...

సూరత్‌: సూరత్‌ వస్త్ర వ్యాపారులు తీసుకొచ్చిన కొత్త ఆఫర్ అందరినీ ఆకట్టుకుంతున్నది. మహిళలు చీర కొంటె చీరతో పాటు కరోనా కిట్లు ఉచితంగా అందిస్తున్నారు. ఆ కిట్ లో శానిటైజర్లు, హోమియోపతి మందు బిళ్లల డబ్బా, ఆయుర్వేదం పౌడర్, మాస్క్‌లు ఉంటాయి. చీర కొనుగోలు చేసిన వారికి  ఈ కరోనా కిట్ బాక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. “కరోనా కవచం” పేరుతో ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఖరీదు ఉండే చీరలకు ఇలా కరోనా కవచం బాక్సులు అందజేస్తున్నారు. చీరలకు “కరోనా కిట్లు ఫ్రీ” అంటూ సూరత్ వ్యాపారులు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిన వెంటనే యూపీ, రాజస్థాన్, బీహార్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు.  


logo