ఆదివారం 12 జూలై 2020
National - Jun 17, 2020 , 23:19:06

తగ్గిన పన్ను వసూళ్లు

తగ్గిన పన్ను వసూళ్లు

ఢిల్లీ : కరోనా మహమ్మారి,లాక్ డౌన్ కారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు భారీగా గండిపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి క్వార్టర్‌లో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.1,37,825 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31 శాతం తగ్గాయి. జూన్ 15వ తేదీ నాటికి చెల్లించాల్సిన ముందస్తు చెల్లింపులు గత ఏడాదితో పోలిస్తే 76 శాతం మేర తగ్గడం ఇందుకు ముఖ్య కారణం. ఇటీవలే ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.  కంపెనీలు చెల్లించే ముందస్తు పన్ను చెల్లింపులు ఏకంగా 76 శాతం పడిపోవడం గమనార్హం. కోరనా-లాక్ డౌన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌-మే నెలల్లో దాదాపు 80 శాతం ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోవడం కూడా పన్ను వసూళ్లను దెబ్బతీసింది. ఏప్రిల్ - మే నెలలో దాదాపు 80 శాతానికి పైగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో పన్ను వసూళ్లపై ప్రభావం పడింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ క్వార్టర్‌లో జూన్ 15వ తేదీ నాటికి 31 శాతం క్షీణించి గత ఏడాది రూ.1,99,755 కోట్ల నుండి రూ.1,37,825 కోట్లకు పడిపోయాయి. 


logo