ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 22:53:15

పెండ్లి కుమారునికి ఘోర అవమానం

 పెండ్లి కుమారునికి ఘోర అవమానం

భోపాల్:  మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌లోని సతై ప్రాంతంలో దళిత వర్గానికి చెందిన ఓ యువకుడు వివాహ వేడుకల్లో గుర్రంపై ఊరేగుతుండగా.. ఘోరంగా అవమానించారు.    గుర్రంపై ఊరేగుతున్న ఆ కుమారుడ్నిఓ వర్గానికి చెందిన వారు కిందకు లాగేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ వర్గానికి చెందిన వారు కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అందుకు కారణమైన నలుగురు వ్యక్తులను అదుపు లోకి     తీసుకున్నారు.


logo