ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 22:13:36

ఆర్టీసీ బస్ డ్రైవర్‌కు పాజిటివ్.. డిపో క్లోజ్

 ఆర్టీసీ బస్ డ్రైవర్‌కు పాజిటివ్.. డిపో క్లోజ్

తిరువనంతపురం : కేరళలో ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కేఎస్‌ఆర్‌టీసీలో కలకలం రేగింది. ప్రజా రవాణా పునరుద్ధణలో భాగంగా జిల్లాల మధ్య కేఎస్‌ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో పప్పనమ్‌కొడె బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్న 40 ఏండ్ల బస్సు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరం రావడంతో ఆయనను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా పాజిటివ్ ‌‌వచ్చింది . దీంతో డిపోలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించగా... పప్పనంకొడె బస్ డిపోను మూసివేశారు.  ఐదు రోజుల్లో వారందరికీ కరోనా పరీక్షలు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. 


logo