శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 21:51:31

పుచ్చకాయలను ఆస్వాదిస్తూ తింటున్న ఎలుగుబంట్లు....

 పుచ్చకాయలను ఆస్వాదిస్తూ తింటున్న ఎలుగుబంట్లు....

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులోని బన్నర్‌ఘట్ట బేర్ రెస్క్యూ సెంటర్‌లోని ఎలుగుబంట్ల కు  ఓ వన్యప్రాణుల సంరక్షణ సంస్థ  పుచ్చకాయలను అందించింది. అనంతరం వాటిని ఆస్వాదిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్లు పెడుతున్నారు. బన్నర్‌ఘట్ట బేర్ రెస్క్యూ సెంటర్‌లోని బేర్స్ కు వైల్డ్ లైఫ్ ఎస్ ఓ ఎస్ సంస్థకు చెందిన వాలంటీర్లు ప్రతిరోజూ ఆహారాన్ని అందిస్తుంటారు. ఎలుగుబంట్లు  తినేందుకు వీలుగా పుచ్చకాయలను ముక్కలుగా కోసి ప్రతిరోజూ టన్నులకొద్దీ ఆ అడవిలో అక్కడక్కడా అందుబాటులో ఉంచుతారు. అయితే  ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఆ వీడియోను చుసిన నెటిజన్లు వింత వింత కామెంట్లు పెడుతున్నారు.  "ఎంత అందంగా టెంటున్నాయో "అంటూ ఒకరు,  ఎలుగుబంట్లు కాదు అవి కుక్కలు.. అంటూ ఇంకొకరు.. పుచ్చకాయ తినడం చాలా సంతోషంగా ఉంది! ... ఎలుగుబంట్లకు వినండి పెట్టిన వారికి ధన్యవాదాలు ”అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. 

 


logo