శుక్రవారం 03 జూలై 2020
National - Jun 17, 2020 , 17:42:12

తక్కువ ధరకే కరోనా కిట్‌లను తయారు చేసిన ఐఐటి - గౌహతి

తక్కువ ధరకే కరోనా కిట్‌లను తయారు చేసిన ఐఐటి - గౌహతి

గౌహతి: పరీక్షా సామర్థ్యాలను పెంచడానికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గౌహతి (ఐఐటి-జి)సిద్ధమైంది. తక్కువ-ధరకే నాణ్యత కలిగిన పరీక్షా కిట్లను 'మేడ్ ఇన్ అస్సాం' పేరుతో కోవిడ్ -19 కిట్‌లను అభివృద్ధి చేసింది. ఈ సంస్థ వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా (విటిఎం) కిట్‌లను అభివృద్ధి చేసింది. ఆర్టి -పిసిఆర్ కిట్లు , ఆర్ఎన్ఏ   ఐసోలేషన్ కిట్లు, ముక్కు , గొంతు శుభ్ర పరిచే నమూనాలను ఉంచడానికి ఉపయోగించే మొదటి 20,000 వీటీఎం కిట్లను బుధవారం అస్సాం ప్రభుత్వానికి అప్పగించారు. అసోమ్ ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ ఈ సందర్భంగా కిట్‌ లను ప్రారంభించారు.“ఇది చాలా మంచి పరిణామం. ఇప్పటి వరకు మేము మా వీటీఎం కిట్లను ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నాం. ఈ కిట్ల కొరత చాలా ఉన్నది. లాక్‌డౌన్ సమయంలో వీటీఎం కిట్లు దొరక్క నమూనా సేకరణలో సమస్యలను ఎదుర్కొన్నాం ”అని మంత్రి హిమంత బిస్వా చెప్పారు.

“ఇది స్వదేశీ‘ మేడ్ ఇన్ అసోమ్  ఉత్పత్తి. మాకు రోజూ దాదాపు పదివేల వీటీఎం కిట్లు అవసరం.  ఇంతకుముందు ప్రతి కిట్ రూ. 206 వెచ్చించాల్సి వచ్చేది. కాని ఇప్పుడు అదే కిట్‌ను రూ. 140 వస్తుందని ”ఆయన పేర్కొన్నారు . ఈ కిట్ల  కు భారీ డిమాండ్ తోపాటు అధిక ధర ఉండడంతో అసోమ్ లోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) వీటిని అభివృద్ధి చేయమని ఐఐటి-జిని కోరింది. దీంతో ఇన్స్టిట్యూట్ ఈ కిట్‌లను అభివృద్ధి చేయడానికి ముందు కొచ్చింది.  మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో   పెద్ద ఎత్తున పరీక్షలు జరగాల్సి ఉన్నది. అందుకోసం ఇవి ఎంతో సహాయపడతాయని ” ఐఐటి-జి కెమిస్ట్రీ విభాగం లోని ప్రొఫెసర్ పరమేశ్వర్ కృష్ణన్ అయ్యర్ అన్నారు. ఈ నూతన కిట్ల ద్వారా రోజుకు దాదాపు 10,000 పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం వరకు రాష్ట్రంలో 4,511 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు గుర్తించగా..ఎనిమిది మంది మరణించారు.  


logo