బుధవారం 08 జూలై 2020
National - Jun 17, 2020 , 13:24:24

జూన్ 21న ఆకాశంలో అద్భుతం ఆవిష్క్రృతం కానున్నది

జూన్ 21న ఆకాశంలో అద్భుతం ఆవిష్క్రృతం కానున్నది

ఢిల్లీ :భారతదేశంలో ఈ ఆదివారం (జూన్ 21న )అంతరిక్షం లో ఈ శతాబ్దపు అద్భుతం ఆవిష్క్రృతం కాబోతున్నది.  ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణానికి సాక్ష్యమివ్వనున్నది.   రాజస్థాన్, హర్యానా ,ఉత్తరాఖండ్ లలో గరిష్టంగా 30 సెకన్ల పాటు మేడలో హారం వలే  కనిపించనున్నది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా ఉండనున్నది. ఇండియాతోపాటూ... ఆసియా దేశాలు, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్రికా, చైనా, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించనున్నది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది. ప్రత్యక్షంగా కాకుండా ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించి గ్రహణాన్ని చూడొచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని "రింగ్ ఆఫ్ ఫైర్ "గా అభివర్ణిస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇది ఏర్పడే సమయంలో... భూమి, సూర్యుడి మధ్యలో చందమామ అడ్డుగా వస్తుంది.

చందమామ పూర్తిగా సూర్యుణ్ని మూసివేసినప్పుడు... నల్లటి చందమామ చుట్టూ... రింగ్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. దీనినే "రింగ్ ఆఫ్ ఫైర్" అంటున్నారు. ఉదయం 9.15కి మొదలై... సాయంత్రం 3.04కి ఈ సూర్యగ్రహణం వీడుతుంది. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ఓ ఖగోళ ప్రక్రియ. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం ద్వారా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కొన్నిసార్లు సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. సూర్యుడి వెలుగును చంద్రుడు పూర్తిగా కప్పిఉంచిన కారణంగా భూమిపై చంద్రుడు నీడ మాత్రమే కనిపిస్తుంది. దీన్నే సూర్యగ్రహణం అని అంటారు. ఇలా కేవలం అమవాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. ఈ అరుదైన అద్భుతం మళ్ళీ 2031 సంవత్సరం లో కనిపించనున్నదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 


logo