శుక్రవారం 03 జూలై 2020
National - Jun 17, 2020 , 01:08:41

కర్ణాటక విధానసభ ఉద్యోగికి కరోనా... సభా భవనం మూసివేత

కర్ణాటక విధానసభ ఉద్యోగికి కరోనా... సభా భవనం మూసివేత

బెంగళూరు: అనేక రాష్ట్రాల్లో ఉన్న‌త అధికారులు, సిబ్బంది కోవిడ్ కోర‌ల్లో చిక్కుకున్నారు. కాగా, తాజాగా, కర్ణాటక విధాన సభలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. పౌరసరఫరాలశాఖకు చెందిన మహిళా ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో విధాన సభ భవనంలోని ఆ శాఖకు సంబంధించిన ఐదుగదులను అధికారులు సీజ్ చేశారు. కార్యాల‌యాన్ని పూర్తిగా సానిటైజ్ చేశారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాల‌యం కూడా ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే, కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే 317 కేసులు నమోదవ్వగా..ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కర్ణాటకలో నమోదైన కేసుల సంఖ్య 7,530కి చేరింది. కరోనాకు బలైన వారి సంఖ్య 94కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 72 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.


logo