మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 00:38:44

ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ ప్రారంభం

 ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ ప్రారంభం

ఢిల్లీ  : దేశంలోని గ్యాస్ పరిశ్రమలో సమూలమైన మార్పులు సంభవించనున్నాయి. ఇందులో భాగంగా మొట్టమొదటి ఆన్‌లైన్ డెలివరీ ఆధారిత గ్యాస్ వాణిజ్య కేంద్రం, ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ (ఐజీఎక్స్)ను పెట్రోలియం, సహజవాయు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రారంభించారు. వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేజ్‌తో పూర్తి స్వయంచాలకంగా ఉన్నటువంటి ఈ వెబ్‌సైట్ వినియోగదారులకు సులువుగా అర్థమవుతుందని వెల్లడించారు.ఇది జీమెక్స్ నుంచి అత్యుత్తమ శ్రేణి సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. ఐఈఎక్స్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఏర్పాటుచేసిన ఐజీఎక్స్, మార్కెట్‌లో పాల్గొనేవారికి ప్రామాణిక గ్యాస్ ఒప్పందాలలో వ్యాపారం చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.  భారతదేశంతో పాటుగా విదేశాలకు చెందిన 1000 మందికి పైగా వర్ట్యువల్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.logo