గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 21:24:03

కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

 కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

 తిరువంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. గత కొద్ది రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. నెల క్రితం కరోనా ముక్త్ రాష్ట్రంగా అవతరిస్తుందనుకున్న వేళ.. ఒక్కసారిగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం  కొత్తగా మరో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,366 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,234 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ను కట్టడిలో భాగంగా 125కు పైగా హాట్‌స్పాట్‌లను గుర్తించి.. అక్కడ వైరస్ విజృంభించకుండా కట్టడి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  


logo