మంగళవారం 14 జూలై 2020
National - Jun 16, 2020 , 01:02:34

ఆ నాలుగు రాష్ట్రాలకు 204 ఐసోలేషన్ కోచ్​లు

ఆ నాలుగు రాష్ట్రాలకు 204 ఐసోలేషన్ కోచ్​లు

ఢిల్లీ : క‌రోనాపై పోరాటంలో భారతీయ రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తున్నది. అందుకోసం ఇప్ప‌కే చాలా చోట్ల రైలు బోగీల్లో ఐసోలేషన్ కేంద్రాల‌ను ఆయా ప్రాంతాల్లో బాధితుల‌కు అందుబాటులో ఉంచింది. ప్ర‌స్తుతం ప‌లు రాష్ట్రాల్లో వైర‌స్ తీవ్ర‌త కొన‌సాగుతుండగా.... మరికొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల‌కు మ‌రోమారు రైలు ఐసోలేషన్ బోగీల‌ను త‌ర‌లించింది రైల్వే శాఖ‌. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 204 ఐసోలేష‌న్ బోగీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. కరోనాను కట్టడి చేసేందుకు రైల్వే నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్​లను ఏర్పాటు చేసింది. అందులో సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లలో 20 చొప్పున రాష్ట్రంలో మొత్తం 60 కోచ్​లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 20 కోచ్‌లు అందుబాటులో ఉంచింది. ఢిల్లీలోని శకుర్‌బస్తి రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ డిపోలో 54, యూపీలో 70 కోచ్ లు ఏర్పాటు చేసింది. ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్న మేరకు మరో 500 ఐసోలేషన్ కోచ్​లను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వేశాఖ‌ వెల్లడించింది.


logo