శనివారం 11 జూలై 2020
National - Jun 16, 2020 , 00:44:50

ఈ వృత్తుల వారికి మస్త్ డిమాండ్...

ఈ వృత్తుల వారికి మస్త్ డిమాండ్...

బెంగళూరు : కరోనా వైరస్ తో దేశంలో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పారామెడికల్ స్టాఫ్ తో పాటు హెల్త్ కేర్ రంగంలోని మిగతా విభాగాల ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతున్నది. వేర్ హౌస్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్షన్, సేల్స్, లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ కు డిమాండ్ పుంజుకుంటున్నది. డిజిటల్ మార్కెటీర్లు, సాంకేతిక నిపుణులకు క్రమంగా ఆదరణ పెరుగుతుందని హెచ్ ఆర్ నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్నాళ్లు ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇంకా కంపెనీలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదు . కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఉద్యోగులను నియమించుకునే బదులు అవసరానికి తగ్గట్టు మాత్రమే హైరింగ్ చేపడుతున్న విషయాన్ని గుర్తించాలని విశ్లేషకులు   అభిప్రాయపడుతున్నారు.logo