గురువారం 02 జూలై 2020
National - Jun 16, 2020 , 00:12:59

జీవీకే ఉద్యోగుల జీతాలు కోత

 జీవీకే ఉద్యోగుల జీతాలు కోత

హైదరాబాద్:కరోనా మహమ్మారి అన్ని సంస్థల ఆదాయానికి గండి కొట్టింది. అందుకోసమే పలు కంపెనీలు తమ సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. అదే బాటలో జీవీకే గ్రూప్ కూడా పయనిస్తున్నది. తమ ఉద్యోగుల వేతనాల్లో 10నుంచి 30 శాతం కోత విధించింది. లాక్ డౌన్ నేపథ్యంలో గత మూడు నెలల కాలంలో వ్యాపారాలు క్లోజ్ అయ్యాయని, దీంతో ఈనిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. జీవీకే గ్రూప్‌లో 1800 మంది ఉద్యోగులు ఉన్నారు. రూ.10 లక్షల నుండి రూ.25 లక్షలకు పైగా వేతనం ఉన్న వారికి 10 శాతంతగ్గించగా , రూ.25 లక్షలకు పైగా వేతనం అందుకుంటున్న వారికి 20 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. సీనియర్, మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తున్నట్లు ఆసంస్థ పేర్కొన్నది.logo