సోమవారం 13 జూలై 2020
National - Jun 15, 2020 , 23:33:10

సురక్షితమైన నీటి సరఫరాకు భరోసా ఇస్తున్న వాబాగ్

 సురక్షితమైన నీటి సరఫరాకు భరోసా ఇస్తున్న వాబాగ్

హైదరాబాద్: కోవిడ్-19 సంక్షోభ సమయంలో హైదరాబాద్ నగరవాసులకు అవాంతరాలు లేని రీతిలో స్వచ్ఛమైన , సురక్షితమైన తాగునీటికి వాబాగ్ భరోసా అందిస్తున్నది. నగరంలోని నీటి శుద్ధి కర్మాగారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా లాక్‌డౌన్ దశలో ప్రజల ఆరోగ్య, పరిశుభ్రతా అవసరాలను తీర్చగలిగింది. వాబాగ్ ప్రస్తుతం కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్‌ను కొండాపూర్ వద్ద 1230ఎంఎల్‌డీ సామర్థ్యంతో, గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టును మల్లారం వద్ద 735 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లోని కోటి మంది జనాభా తాగునీటి అవసరాలను ఇవి తీర్చనున్నాయి. ఈ ప్లాంట్‌లే నగరంలోని సుప్రసిద్ధ పారిశ్రామిక ప్రాంతాలకు సైతం నీటిని సరఫరా చేస్తున్నాయి. వాబాగ్ కోవిడ్ వారియర్స్, మెరుగైన భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ 24 గంటలూ పనిచేస్తున్నారు. కోవిడ్ సంక్షోభ వేళ ఓ అండ్ ఎం బృందం అందించిన సేవలను వాటెక్ వాబాగ్ లిమిటెడ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ,గ్లోబల్ హెడ్ రజ్నీష్ చోప్రా ప్రశంసించారు.

"ఇటువంటి క్లిష్ట సమయంలో హైదరాబాద్ నగరవాసులకు సహాయపడటంతో పాటు, వారికి సురక్షితమైన , స్వచ్ఛమైన తాగునీటిని అందించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల కారణంగా నగరం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటం, వైరస్‌తో పోరాడేందుకు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ప్రధానం. అందుకోసమే ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు భరోసానందిస్తూ తగినంత నీటిని సరఫరా చేయగలుగుతున్నాము. మా ఆపరేషన్స్ బృందం 24 గంటలూ పనిచేయడంతో పాటు, నిరంతర నీటి సరఫరాకు కృషి చేస్తున్నారు. మా క్లయింట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్‌బీ)కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం " అని రజ్నీష్ చోప్రా అన్నారు. ఈ ప్లాంట్‌ల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులనూ పొందడంలో వారు మాకు సహాయం అందించారు. అలాగే మా ఓ అండ్ ఎం బృందాలు సైతం ప్లాంట్ ల వద్ద పూర్తి నిబద్ధతను చాటుతూ ఈ ఆరోగ్య సంక్షోభ వేళ ప్రజల నీటి అవసరాలకు తీర్చేందుకు తీవ్రంగా శ్రమించారు'' అని  ఆయన పేర్కొన్నారు.logo