ఆదివారం 05 జూలై 2020
National - Jun 15, 2020 , 21:11:47

కంపెనీల చూపు... ఫ్రీలాన్స్ విధానం వైపు ...

 కంపెనీల చూపు... ఫ్రీలాన్స్ విధానం వైపు ...

బెంగళూరు: ఏదైనా సంస్థ ఉద్యోగిని నియమించుకుంటే పని ఉన్నా లేకున్నా జీతం ఇవ్వాల్సిందే . అపాయింట్మెంట్ లెటర్ లో రూల్స్  ప్రకారం ఇతర అలవెన్సులు, జీత , భత్యాలు చెల్లించాలి. అంతేకాదు  ఉద్యోగి భద్రత, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి తప్పనిసరి . కానీ, ఫ్రీలాన్స్ విధానంలో ఇటువంటివేమీ ఉండవు. అందుకోసమే దేశంలో ఎక్కువ కంపెనీలు ఫ్రీలాన్స్ వర్క్ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇదే అంశం పై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. బెంగళూరు కు చెందిన రెఫ్రెన్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో 14,000 మంది ఫ్రీలాన్సర్లు పాల్గొన్నారు. వారిలో 64శాతం మంది తమకు లాక్ డౌన్ తర్వాత పని పెరిగిందని వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ నెలలతో పోల్చితే మే నెలలో 63శాతం ఇన్వాయిస్ లు పెరిగాయని తెలిపారు.

ఫ్రీలాన్స్ వర్కులు అధికంగా పెరిగిన వారిలో కంటెంట్ రైటర్ల కు 80శాతం డిమాండ్ పెరిగి తొలిస్థానంలో నిలిచింది. 76శాతం అధిక డిమాండ్ తో గ్రాఫిక్ డిజైనర్లు నిలిచారు. వ్యయాలు తగ్గించుకునేందుకు కంపెనీలు ఫ్రీలాన్స్ వైపు చూస్తున్నాయని ఈ సర్వే లో తేలింది. కరోనా వల్ల అనిశ్చితి పెరిగిపోయింది. కాబట్టి, తాత్కాలిక పనులను ఇలాంటి పద్ధతిలో పూర్తిచేయటమే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. ఫ్రీలాన్సర్ల కు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ల లో కూడా 75శాతం వృద్ధి కనిపిస్తుదట. మరోవైపు ప్రముఖ హెచ్ ఆర్ టెక్నాలజీ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్ కూడా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు 20-25శాతం పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఇంటర్నెట్ వ్యాపారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అనుబంధ సేవలు, స్టార్టప్ కంపెనీలు, ఆతిథ్య సేవలు, క్విక్ సెర్వెడ్ రెస్టారెంట్లు, రిటైల్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నదని ఈ సర్వే లో వెల్లడైంది. త్వరలోనే ఈ రంగాల్లోని ప్రధాన వర్క్ కూడా ఫ్రీలాన్స్ వైపు కన్వెర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. logo