బుధవారం 08 జూలై 2020
National - Jun 15, 2020 , 20:34:52

జులై నుంచి "ఎంఎస్ఎంఈ "లకు కొత్త ప్రమాణాలు

జులై నుంచి

 ఢిల్లీ : దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు కొత్త ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దేశంలో మొత్తం ఆరుకోట్లకు పైగా మైక్రో, స్మాల్ అండ్ మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. వీటి ఆధారంగా జూలై నుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితా రూపొందించనున్నది. సవరించిన ప్రమాణాల ప్రకారం రూ.50 కోట్ల ఖర్చు, రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ మధ్యతరహా వ్యాపారంలోకి వస్తుంది. రూ.1 కోటి పెట్టుబడి కలిగి రూ.5 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ మైక్రో కేటగిరీలోకి, అలాగే, రూ.10 కోట్ల పెట్టుబడి, రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌గా వర్గీకరిస్తారు.

ఇప్పుడు తయారీ,సేవా పరిశ్రమల మధ్య తేడా ఉండదు. ఈ కొత్త మార్గదర్శకాలు ఎంఎస్ఎంఈలను మెరుగుపరిచేందుకు, మరింత విస్తరించేందుకు ఉపయోగపడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి ఎంఎస్ఎంఈల ఎగుమతులను టర్నోవర్ లెక్కింపు నుంచి మినహాయించాల్సిన అవసరం ఉన్నది. ఎంఎస్ఎంఈ నెట్ వర్క్ ప్రయోజనాలు కోల్పోకుండా ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఎగుమతి చేసే వీలు కల్పిస్తుంది. దీంతో ఎగుమతి రంగం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. అదే జరిగితే వృద్ధి పెరుగుతుందని, ఆర్థికంగా బలపడుతుందని, తద్వారా  ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఎంఎస్ఎంఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణలకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈడీ యాక్ట్, 2006 ప్రకారం ఉన్న ప్రమాణాలు తయారీ, సేవా విభాగాలకు భిన్నంగా ఉంటాయి. ఆర్థిక పరిమితులపరంగా కూడా బలహీనంగా ఉందని చెబుతున్నారు. మే 13, 2020 ఆర్థిక ప్యాకేజీ ఆధారంగా చేసిన ప్రకటనకు తోడు మరిన్ని సవరణలు జరగవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.  logo