బుధవారం 08 జూలై 2020
National - Jun 15, 2020 , 19:44:21

కరోనా ఎఫెక్ట్ : నిర్ణయాన్ని మార్చుకున్న ఫోర్డ్

కరోనా ఎఫెక్ట్ : నిర్ణయాన్ని మార్చుకున్న ఫోర్డ్

కాలీఫోర్నియా : అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఎలక్ట్రికల్ వాహనాలను 2022 సంవత్సరం చివరి నాటికి తీసుకురావాలను కుంటున్నది. ఇటీవల 2021లో ఈ -వెహికిల్స్ ను తెస్తామని ప్రకటించిన ఫోర్డ్ సంస్థ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నది. కోవిడ్ -19 కారణంగా ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి కురుకుపోయింది. అందుకోసమే ఫోర్డ్ F-150 ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి కాస్త ఆలస్యంగా తీసుకువస్తుందని  ఫోర్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జిమ్ ఫర్లే ఇటీవల ఎలక్ట్రిక్ ఎఫ్ -150 '2022 మధ్యలో' లాంచ్ చేస్తామని చెప్పారు. అయితే  మొదటిసారి 2019 నవంబర్‌లో ఎలక్ట్రిక్ ఎఫ్ -150 ను ప్రదర్శించింది. అప్పటి నుంచి దీని పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ ఎఫ్ -150 వాహనాన్ని కాస్త ఆలస్యంగా తీసుకురానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 2020 మొదటి త్రైమాసికంలో దాని అమ్మకాలు 13శాతం తగ్గాయి. భవిష్యత్ లో మరిన్ని నష్టాలను చవి చూడాల్సి వస్తుందనే ఆలోచనతో  ఫోర్డ్ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకున్నది.తాజావార్తలు


logo