సోమవారం 13 జూలై 2020
National - Jun 15, 2020 , 01:48:30

యువతకు స్ఫూర్తినిస్తున్న'పనీపాటు' హిప్‌హాప్ ట్రాక్‌

యువతకు స్ఫూర్తినిస్తున్న'పనీపాటు' హిప్‌హాప్ ట్రాక్‌

 హైదరాబాద్: యుఎస్ కేంద్రంగా కలిగిన భారతీయ సంగీతకారుడు ధనేష్ మరో అడుగు ముందుకేశారు.  తెలుగు సంగీతాన్ని కొత్తపుంతలు తొక్కించాలనే ఉద్దేశం తో ధనేష్ తనదైన శైలిలో అంతర్జాతీయ పాప్ మ్యూజిక్ ప్రపంచంలో అడుగుపెట్టారు. పాప్ మ్యూజిక్ రంగంలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించే లక్ష్యంతోనే తన తొలి సింగిల్ 'తప్పిపోయానే' ను విడుదల చేశారు. అది అందించిన అపూర్వ విజయ స్ఫూర్తితో ఆర్ అండ్ బీ ఆర్టిస్ట్ ధనేష్ తన రెండవ సింగిల్ 'పనీపాటు'ను  జూన్ 12వ తేదీన విడుదల చేశారు. తెలుగు పాప్/ హిప్‌హాప్ ట్రాక్‌ పలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ లో రిలీజ్ అవ్వడమే  కాకుండా ఈ పాట యువత ను ఉర్రుతలూగిస్తున్నది. అతి తక్కువ కాలంలోనే ధనేష్ అటు శ్రోతలు, ఇటు సుప్రసిద్ధ సంస్థల దృష్టిని ఆకర్షించారు. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్, లేబుల్స్‌కు సంబంధించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన డిజిటల్ డిస్ట్రిబ్యూటర్, సర్వీసెస్ ప్రొవైడర్ బిలీవ్‌తో ధనేష్ ఒప్పందం చేసుకున్నారు. బిలీవ్ సంస్థ తెలుగులో చేస్తున్న తొలి సింగిల్ ఇది. జీవితంలో భారీ లక్ష్యాలను సాధించాలని తపించే యువతకు స్ఫూర్తినిచ్చే రీతిలో 'పనీపాటు' పాట ఉన్నది. "తెలుగు సంగీతాన్ని పునర్న్విచించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. అందుకోసమే సరికొత్త సంగీతాన్ని అందించానని ధనేష్ తెలిపారు.  


logo