మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Jun 12, 2020 , 16:06:20

ఎస్ఎంఎస్ ద్వారా నిల్ జీఎస్‌టీఆర్-3బీ ఫైలింగ్‌

 ఎస్ఎంఎస్ ద్వారా నిల్ జీఎస్‌టీఆర్-3బీ ఫైలింగ్‌

న్యూఢిల్లీ: జీఎస్‌టీ రిటర్న్ దాఖలును మరింత సులభతరం చేయడంలో భాగంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) ఇప్పుడు శూన్య (నిల్) జీఎస్‌టీఆర్ -3బీ రిటర్న్‌ను ఎస్ఎమ్మెస్ ద్వారా దాఖలు చేసే సౌలభయాన్ని తీసుకువచ్చింది. తమ నమోదిత మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. తమ దగ్గర నుంచి ఎలాంటి ఔట్‌వార్డ్ సరఫరా, అలాగే లయబిలిటీ (రివర్స్ చార్జ్ లయబిలిటీ సహా)ఒక నెలలో లేకుంటే నిల్ జీఎస్‌టీఆర్-3బీ దాఖలు చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్ విధానంలో సైతం నిల్ రిటర్న్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ సదుపాయం ద్వారా 20 లక్షల మందికి పైగా జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని అంచనా. మొత్తం జీఎస్‌టీ చెల్లింపుదారుల్లో 20శాతం మంది లబ్ది చేకూరనున్నది. " మేము తీసుకువచ్చిన ఎస్ఎంఎస్ ఫైలింగ్ విధానం ‌తో ఈ తరహా వ్యాపారాలకు జీఎస్‌టీ సమ్మతి మరింత సులభతరం అవుతుందని" జీఎస్‌టీఎన్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు.