బుధవారం 15 జూలై 2020
National - Jun 06, 2020 , 00:36:33

జూన్ 19 న సుష్మితా సేన్ తాజా సిరీస్ విడుదల

 జూన్ 19 న సుష్మితా సేన్ తాజా సిరీస్  విడుదల

హైదరాబాద్: ఆర్‌ఎంఎఫ్ (రామ్ మాధ్వాని ఫిలింస్) భాగస్వామ్యంతో హాట్‌స్టార్ స్పెషల్స్ వ్యవస్థీకృత నేరాలు రోజువారీ కుటుంబ వ్యాపారంగా తీవ్రమైన ద్రోహాన్ని ఒంటబట్టించుకున్న కథ-"ఆర్య"ను ప్రసారం చేసేందుకు సిద్ధం మైంది. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పిస్తున్న" ఆర్య "జూన్ 19 న డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే విడుదల కానుంది. హాట్‌స్టార్ స్పెషల్స్‌లో ప్రసారం కానున్న ఆర్య ప్రేమించే భార్య , చిటపటలాడే తల్లి (ఆర్య) పాత్రలపై మాజీ మిస్ యూనివర్స్ , నటి సుష్మితా సేన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నది. కథానాయికగా నటి సుష్మితా సేన్ డిజిటల్ అరంగ్రేటాన్ని ఈ షోతో ప్రారంభించగా, దాదాపు ఒక దశాబ్దం అనంతరం ఆమె నటించేందుకు కెమెరా ముందుకు వచ్చారు. ప్రజాదరణ పొందిన నటుడు చంద్రచూర్ సింగ్ కూడా ఈ విలక్షణ కథలో తెర పైకి కనిపించేందుకు ముందుకు వచ్చారు. ఈ షోలో ప్రతిభావంతులైన నటులు నమిత్ దాస్, సికందర్ ఖేర్, జయంత్ కృపాలాని, సొహైలా కపూర్, సుగంధా గార్గ్, మాయా సరీన్, విశ్వజిత్ ప్రధాన్ ,మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. 


logo