గురువారం 02 జూలై 2020
National - Jun 05, 2020 , 00:20:21

సోషల్ మీడియా లో ప్రచారం వల్లనే వీటి పై అవగాహన పెరిగింది

 సోషల్ మీడియా లో ప్రచారం వల్లనే వీటి పై అవగాహన పెరిగింది

హైదరాబాద్:  రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నది. అయితే సోషల్ మీడియా లో జరిగే ప్రచారం వల్లనే వినియోగదారుల్లో  వీటిపై అవగాహన పెరిగింది .  ఇందుకు అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి మొబైల్ ఆప్ లు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. సోషల్ మీడియా లో వచ్చిన మెసేజ్ లు, సోషల్ సెలబ్రిటీ లు చెప్పే విషయాలను వారి ఫాలోవర్స్ పాటిస్తుండటంతో కూడా ఈ ప్రొడక్టుల సేల్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే పెద్ద బ్రాండ్లుగా ఉన్న కంపెనీలు అమ్మకాల్లో దూసుకుపోతుండగా.. కొత్త బ్రాండ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో మార్కెట్లోకి మరిన్ని ఇమ్మ్యూనిటి బూస్టింగ్ ప్రోడక్టులు విపణిలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


 

 


logo