శుక్రవారం 03 జూలై 2020
National - Jun 03, 2020 , 22:17:52

పెరుగుతున్నఫాస్టాగ్‌ కార్డుల వినియోగం

 పెరుగుతున్నఫాస్టాగ్‌ కార్డుల వినియోగం

హైదరాబాద్: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో వాహనాల జోరు పెరిగింది. హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇక ఔటర్‌ రింగురోడ్డులోనూ వెహికిల్స్‌ దూసుకుపోతున్నాయి. అయితే ఓఆర్‌ఆర్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ వినియోగం బాగా పెరిగింది. డబ్బులిచ్చి రసీదు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో.. చాలా మంది ఫాస్టాగ్‌నే వినియోగిస్తున్నారు. టోల్‌ప్లాజాల దగ్గర గతంతో పోల్చితే 40 శాతం ఫాస్టాగ్‌ కార్డుల వినియోగం పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నగదు లావాదేవీల కు బదులు క్యాష్‌లెస్‌ పేమెంట్‌కే వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. ఫాస్టాగ్‌ వల్ల మనీ కూడా సేవ్‌ అవుతుందని ఓఆర్‌ఆర్‌ సిబ్బంది చెబుతున్నారు. ఫాస్ట్‌టాగ్‌ వాడడం వల్ల తిరుగు ప్రయాణానికి మనీ తక్కువ పడుతుందని అంటున్నారు.


logo