శుక్రవారం 03 జూలై 2020
National - Jun 02, 2020 , 13:37:32

స్టార్‌ నెట్‌వర్క్‌ లో ‘5 స్టార్‌ కిచెన్‌ ఐటిసి చెఫ్‌ స్పెషల్‌’

  స్టార్‌ నెట్‌వర్క్‌ లో ‘5 స్టార్‌ కిచెన్‌ ఐటిసి చెఫ్‌ స్పెషల్‌’

 ముంబై : కుకింగ్‌ రంగంలో అనుభవం కలిగిన ఐటిసి ఫుడ్స్‌, సులభంగా తయారుచేయగల కొన్ని ప్రాంతీయ వంటకాలను స్టార్‌ నెట్‌వర్క్‌ వీక్షకులతో పంచుకొంటున్నది. ఐటిసి హోటల్స్‌లోని ఉత్సాహవంతులైన కిచెన్‌ బ్రిగేడ్‌ ఈ వంటకాలను అందిస్తున్నది. ఇంట్లోనే ఉండి హోమ్‌ చెఫ్‌లు వంటకాలతో ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ కృషిని మెచ్చుకుంటూ, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫుడ్స్‌ బిజినెస్‌లో ఒకటైన, ఆశీర్వాద్‌ లాంటి జనాదరణ పొందిన తన బ్రాండ్‌లతో మార్కెట్‌లో దూసుకుపోతున్న ఐటిసి ఫుడ్స్‌ సరిలోట్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా " 5 స్టార్‌ కిచెన్‌ ఐటిసి చెఫ్‌ స్పెషల్‌" పేరుతో భారతీయులకు రుచికరమైన వంటకాలనుఅందించే ప్రయత్నం చేస్తున్నది.

రాజస్థానీ బఫ్లాబటి, కొంకణి దోదక్‌దోశ, బెంగాలి చనర్‌పయేష్‌, పోటోలేర్‌డోర్మా లాంటి నోరూరించే సాంప్రదాయ వంటకాల నుంచి అమరంత్‌తో ఆశీర్వాద్‌ మల్టీ మిల్లెట్‌ పిజ్జా, యిప్పీట్రైకలర్‌ పాస్తా మసాలా ,పుట్టగొడుగులు, సల్సా , మ్యాంగో డిప్‌తో మ్యాడ్‌ ఏంజిల్స్‌ నాచో, బి-నేచురల్‌ ఆమ్‌పాపడ్‌ ,గుర్‌కుల్ఫీ క్యాండీ , డార్క్‌ ఫ్యాంటసీ షేక్‌ లాంటి సాంప్రదాయేతర వంటకాలవరకు 12 మంది ఐటిసి హోటల్‌ కు చెందిన చెఫ్‌లు తమ అసాధారణ పనితనంతో మన దేశంలోని వంటకాల వారసత్వాన్ని చాటనున్నారు. యాంకర్‌గా మారిన  జర్నలిస్టు దీరజ్‌ జునేజా ఆహార ప్రాధాన్యతలు గురించి , భారతీయ వంటకాల గురించి చెఫ్‌లతో మాట్లాడతారు. ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం11 గంటలకు ప్రసారంమవుతుంది. 12 ఎపిసోడ్‌లతో 7 భాషల్లో 33 చానల్స్‌లో హాట్‌స్టార్‌, స్టార్‌టివి నెట్‌వర్క్‌లో ప్రసారమవుతున్నది. 


logo