గురువారం 02 జూలై 2020
National - May 31, 2020 , 01:52:46

వ్యక్తిగత ఋణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇవి పాటించండి..

వ్యక్తిగత ఋణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇవి పాటించండి..

హైదరాబాద్: ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారంతా తమ అవసరాల నిమిత్తం ఋణం తీసుకుంటారు. పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ లేదా వెహికిల్ లోన్ ఇప్పుడు సాధారణం. అవసరమైనప్పడుు లోన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఇలాంటి సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి. అనాలోచితంగా తీసుకునే లోన్ ఆ తర్వాత మనకు భారమై కూర్చుంటుంది.వడ్డీరేటు ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఈఎంఐ-కాలపరిమితి మనకు ఎక్కడ అనుకూలంగా ఉంది, ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడ తక్కువగా ఉంది వంటి అంశాలను పరిశీలించి లోన్ తీసుకోవడం మంచిది. పర్సనల్ లోన్ విషయంలో చాలామంది మరీ నిర్లక్ష్యంగా ఉంటారు. హోమ్ లోన్, వెహికిల్ లోన్ వంటి సురక్షిత లోన్ల కంటే పర్సనల్ లోన్ పైన వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎన్నో అంశాలు చూసుకోవాలి. కొంతమంది తమ అవసరానికి మించి లోన్ తీసుకుంటారు.

రూ.3 లక్షలు అవసరమైతే మనకు రూ.4 లక్షలు వస్తుంది కదా, మిగతాది మనకు అలా ఉండిపోతుంది.. తీసేసుకుందాం అని భావిస్తారు. ఎంతమేరకు అవసరమో అంతే తీసుకోవడం మంచిది. అవసరానికి మించి తీసుకుంటే ఆ తర్వాత ఆ మొత్తం మీ చేతుల్లో ఉండటం తక్కువ. అవసరపు ఖర్చు పెట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకొంతమంది ఆఫర్లు వంటివి చూసి అవసరం లేకున్నా తీసుకుంటారు. అది కూడా సరికాదు. అనవసరంగా లోన్ తీసుకొని, దానిని సరిగ్గా చెల్లించకుండే మీ క్రెడిట్ స్కోర్ పైన దెబ్బపడుతుంది. అంటే అవసరం లేకుండా లేదా అవసరానికి మించి తీసుకోవద్దు. మీరు రుణం తీసుకునే ముందు ఓసారి క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది. 750 ప్లస్ స్కోర్ ఉంటే మీ దరఖాస్తు సులభంగా ఆమోదం పొందుతుంది. అలాగే ప్రాధాన్యతా వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటివి ఉంటాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. రుణం తీసుకోవడానికి ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకొని, క్రిడెట్ కార్డు, ఈఎంఐ సహా అన్ని చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ కొంత మెరుగుపరుచుకోవచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే బ్యాంకును సంప్రదించాలి.


 


logo