ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడమంటే అంత ఈజీ కాదు. స్థలం ఉంటే తక్కువలో తక్కువ రూ. 20లక్షలు కావాలి. ఇంటి స్థలంతో కలిపితే దీనికి మూడు రెట్లవుతుంది. అది కూడా ఏరియాను బట్టి మారుతుంది. తక్కవధరకు ఇల్లు కట్టుకోలేమా? అంటే.. కట్టకోవచ్చు అంటున్నాడు జీడిమెట్లలోని షేక్ జిలానీ. రూ. 3 లక్షల నుంచి 20 లక్షల రూపాయలోపు ఇంటిని నిర్మిస్తామని చెబుతున్నాడు. సాధారణ ఇంటికంటే ఇది తీసిపోదని అన్ని వసతలుతోపాటు దీనికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ ఇంటిని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకోళ్లొచ్చు. ఈ కదిలే ఇంటిని ఎక్కడ నిర్మిస్తారు.. దీని ధర ఎంత?, ఎన్ని రోజుల్లో నిర్మించుకోవచ్చు వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి