గురువారం 02 జూలై 2020
National - May 29, 2020 , 23:15:37

కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకెళ్లిన కోతులు

 కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకెళ్లిన కోతులు

మీరట్ : ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకున్నది. కొన్నికోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్లిపోయాయి. కరోనా వైరస్ పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతులు అతని పై దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయాయి. ఈ అనూహ్య ఘటన మీరట్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరిగింది. ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉ న్నాయి . ఆ కోతి మూక దాడి చేసి కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా కొన్ని టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. అందులో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. దీంతో కోతులను పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు.


logo