బుధవారం 08 జూలై 2020
National - May 28, 2020 , 23:01:59

బిఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్

బిఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్

ఢిల్లీ: దేశంలోని అన్నిటెలికాం సంస్థలు ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో తమ వినియోగదారులకు అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యాన్నిఅందించడానికి ప్రత్యేక డేటా వోచర్‌లను అందిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికామ్ సంస్థలు  వర్క్ ఫ్రేమ్ హోమ్ చేసే వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని డేటాను అందించే డేటా వోచర్‌లను విడుదల చేశాయి. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రూ.1,498 ఎస్టీవి ప్లాన్‌  వినియోగదారులకు అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో రోజువారీ డేటా వాడకంలో రోజువారీ క్యాప్స్ లేకుండా మొత్తంగా 91GB హై-స్పీడ్ డేటాను 365 రోజుల వ్యాలిడిటీ తో అందిస్తున్నది. ఈ మొత్తం డేటాను మీరు ఒకే రోజులో లేదా దాని చెల్లుబాటు వ్యవధిలో ఉపయోగించవచ్చు. ఈ డేటా వినియోగం మీపై ఆధారపడి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించే వారికి ఇది మంచి ప్లాన్. మొదటి వరుసలో గల ఎస్టీవీలలో ఒకటి రూ.96 వోచర్ ప్లాన్. ఇది రోజువారీ 11GB డేటాను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే BSNL రూ.48ల మరో STV డేటా ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి మొత్తంగా 5GB డేటాను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తెలంగాణ , ఆంధ్ర సర్కిళ్ళలో ఇస్తున్నమరో రెండు ప్లాన్లు కూడా ఉన్నాయి. రూ.228 , రూ.268. ఈ ప్లాన్లతో 40GB డేటా 30 రోజుల వాలిడిటీతో అందిస్తున్నది.


 


logo