సోమవారం 06 జూలై 2020
National - May 28, 2020 , 19:33:28

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు

హైదరాబాద్ :  మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలంతా ఇటీవలసమావేశమయ్యారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్ లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు.  ఈ సమావేశానికి బాలకృష్ణ తప్ప మిగతా వాళ్ళు హాజరయ్యారు.  ఇదే విషయం పై స్పందించిన బాలయ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. బాలయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు." నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని, 

బాలయ్య మాట్లాడింది చాలా తప్పని నాగబాబు ఖండించారు. బాలకృష్ణ  వ్యాఖ్యలు పరిశ్రమనే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయని" నాగబాబు అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి , తెలుగు చిత్ర పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని "నాగబాబు డిమాండ్ చేశారు."రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో, తెలుగుదేశం పార్టీని నమ్మితే సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుందని "అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారని ఆయన ప్రశ్నించారు.  బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరుమూసుకుని కూర్చోమని,  ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే అని నాగబాబు అన్నారు.  


logo