శనివారం 04 జూలై 2020
National - May 27, 2020 , 18:44:45

కంపెనీల ప్రచారానికి వేదికవుతున్న టిక్‌టాక్‌

 కంపెనీల ప్రచారానికి వేదికవుతున్న టిక్‌టాక్‌

ముంబై : ప్రముఖ వీడియో షేరింగ్ నెట్ వర్క్ టిక్‌టాక్ వేదిక పై అనేక సంస్థలు తమ బ్రాండ్ల గురించి ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఫైనాన్స్ స్టార్టప్‌లైన బిఎఫ్‌ఎస్ఐ, ఫ్యాషన్ , ఎఫ్‌ఎంసిజి సంస్థలకు చెందిన పలు బ్రాండ్లు ఇప్పటికే టిక్‌టాక్‌లో ప్రచారాన్ని ప్రారంభించాయి. తాజాగా ఇటీవలే చిన్న వ్యాపారాల డిజిటల్ లెడ్జర్ యాప్ ఖాతాబుక్, రుణాలు మంజూరు చేసే యాప్ మనీ వ్యూ , ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ తదితర బ్రాండ్లు తమ గురించి, తమ బ్రాండ్ గురించి అవగాహన కల్పించేందుకు, మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు టిక్‌టాక్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి.

బ్రాండ్‌లతో భాగస్వామ్యాలు, విజయవంతమైన క్యాంపెయన్ల గురించి టిక్‌టాక్ ఇండియా మానిటైజేషన్ ఉపాధ్యక్షుడు సమీర్ సింగ్ మాట్లాడుతూ ‘‘టిక్‌టాక్‌కు ఉన్న విస్తృత పరిధి బిఎఫ్ఎస్ఐతో పాటు వివిధ విభాగాల్లో బ్రాండ్లను ఆకర్షిస్తున్నది. ఈ ప్లాట్‌ఫామ్ పై 200 మిలియన్ వినియోగదారులతో అనుసంధానం అయ్యేందుకు, బిఎఫ్‌ఎస్‌ఐ బ్రాండ్‌లు నూతన డిజిటల్ టచ్ పాయింట్లను అందుకునేందుకు వేచి చూస్తున్నాయి.  గత కొన్ని నెలల్లో మేము బ్యాంకులు, ఆర్థిక సేవలు అందించే సంస్థలు, ఫిన్‌టెక్ నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ల వరకు భాగస్వామ్యాన్నికలిగి ఉన్నామని , వారికి మేము ప్రత్యేకంగా రూపొందించిన విశిష్ట ప్రకటనల ద్వారా సృజనాత్మకత కలిగిన కంటెంట్ తో మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని’’ ఆయన  వివరించారు.logo