బుధవారం 08 జూలై 2020
National - May 25, 2020 , 20:48:22

గుంటూరు జిల్లా మినహా వెంక‌న్న‌లడ్డూ అందుబాటులోకి...

గుంటూరు జిల్లా మినహా వెంక‌న్న‌లడ్డూ అందుబాటులోకి...

అమరావతి: తిరుమల వెంక‌న్న‌లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స్ లో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు అనుమతి ఇవ్వ‌లేదు. దీంతో స్వామివారి ల‌డ్డూల కోసం అక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులు వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. కాగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరులో సైతం లడ్డూల‌ను అమ్మేందుకు టీటీడీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్టున్నది. అయితే శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి  ఊహించ‌ని ఆర్డ‌ర్స్ వ‌స్తున్నాయి. సోమవారం కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు విక్రయించింది టీటీడీ. మంగళవారం మరో 2 లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు త‌మ ప్రాంతాల‌లో కూడా విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల కూడా కోరుతున్నారు. దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల లడ్డూలు చొప్పున తరలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాలోచ‌న‌లు చేస్తున్నది. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఇన్ఫ‌ర్మేష‌న్ కోసం టీటీడీ.. కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు‌. 1,000కి పైగా లడ్డూలు కొనుగోలు చేయాలనుకున్న భక్తులు తమ పూర్తి వివ‌రాల‌ను 5 రోజుల ముందుగా [email protected] మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది.


logo