శుక్రవారం 05 జూన్ 2020
National - May 24, 2020 , 00:49:39

బాలీవుడ్ లో మరో విషాదం

  బాలీవుడ్ లో మరో విషాదం

 బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్నది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘రెడీ’ సినిమాలో నటించిన యువ నటుడు మోహిత్ బఘెల్ క్యాన్సర్ తో మరణించారు. శనివారం ఉత్తరప్రదేశ్ లోని మధురలో మోహిత్ మరణించినట్లు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు. ‘మోహిత్..చాలా తక్కువ వయసులో 26 ఏండ్లకే కన్నుమూశాడు . ఆరు నెలలుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ నిమిత్తం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 15న అతడితో మాట్లాడినప్పుడు.. ఆరోగ్యవంతంగానే ఉన్నాడు. పూర్తిగా కోలుకుంటున్నాడు కూడా.. అతని తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మధురలో ఉంటున్నాడు. మా ఇద్దరికీ సన్నితమైన వ్యక్తి నుంచి మోహిత్ మరణవార్త తెలిసింది’ అని రాజ్ శాండిల్య వెల్లడించారు.  మోహిత్ మరణ వార్త తెలియడంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘కామెడీ సర్కస్’, ‘జబారియా జోడి’ ‘డ్రీమ్‌గర్ల్’ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు మోహిత్ సుపరిచితుడు.


logo