శుక్రవారం 05 జూన్ 2020
National - May 23, 2020 , 21:57:25

వలస కూళీలంటే ఇంత చులకనా...?

వలస కూళీలంటే ఇంత చులకనా...?

డిల్లీ: ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి తిరిగి సొంత ప్రాంతాలకు వెళుతున్న వారిని దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు పలు రకాలుగా ఆదుకుంటుంటే మరికొన్ని రాష్ర్టాలు విమర్శలకు దారి తీసేలా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో విదేశాల నుంచి వస్తున్న వారిని రాచమర్యాదలతో చూస్తూ వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వలసకూళీలను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు సామాజిక కార్యకర్తలు. ఇంకొంత మంది అయితే ఏకంగా ఓటు వేయని వారికి ఇచ్చే మర్యాదలు ఓటు వేస్తున్న పేదలకు లేదని తమ ఆక్రోశాన్ని ప్రభుత్వాలపై వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో శ్రామిక్‌ రైళ్ళలో డిల్లీకి వచ్చిన వలసకూళీలను నిలబెట్టి వారిని పశువులను కడిగినట్లు పెద్ద స్ప్రే పైపుతో వారిపై రసాయనాలు గుప్పించడం పెద్ద వివాదానికి దారి తీస్తుంది. రోడ్డుపై చల్లాల్సిన ప్రమాదకర రసాయనాలను వారిపై చల్లడం పట్ల సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. 


logo