శుక్రవారం 05 జూన్ 2020
National - May 23, 2020 , 17:21:49

లాక్ డౌన్ కారణంగా ఐదో వంతు తగ్గిన గ్యాస్ ఉత్పత్తి

 లాక్ డౌన్ కారణంగా ఐదో వంతు తగ్గిన గ్యాస్ ఉత్పత్తి

ఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి.  ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది . భారత సహజ వాయువు ఉత్పత్తి ఏప్రిల్‌లో ఐదో వంతు తగ్గింది .  దీనికి సంబంధించి ఒఎన్‌జిసి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది .ఏప్రిల్‌లో 2.16 బిలియన్ క్యూబిక్ మీటర్ల ( బిసిఎం)గ్యాస్ ఉత్పత్తి   చేయగా. ఏడాది క్రితం ఇదే నెలలో 2.65 బిసిఎం ఉత్పత్తి కంటే 18.6 శాతం తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఒఎన్‌జిసి 1.72 బిసిఎమ్‌ల ఉత్పత్తిలో 15.3 శాతం ఉత్పత్తి జరిగింది.  ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 202.05 మిలియన్ క్యూబిక్ మీట ర్లు అంటే 10 శాతం తక్కువ గా  సహజవాయువును ఉత్పత్తి చేసింది . భారతదేశ ముడి చమురు ఉత్పత్తి ఏప్రిల్‌లో 6.35 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు చేరుకున్నది. ఒఎన్‌జిసి ఉత్పత్తి ఏప్రిల్‌లో 1.7 మిలియన్ టన్నులు తగ్గింది, కైర్న్స్  వంటి ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న ప్లాంట్లలో 615,800 టన్నులు అంటే 19.2 శాతం ఆయిల్ ను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు ఏప్రిల్‌లో 18.9 మిలియన్ టన్నులు ( 30 శాతం) తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేశాయి. వాహనాలు రోడ్లపైకి రాకపోవడంతో డిమాండు తగ్గింది. దీంతో ఉత్పత్తి జరగలేదు.  


logo