ఆదివారం 31 మే 2020
National - May 23, 2020 , 15:50:17

సాల్ట్ థెరపీ గురించి తెలియని నిజాలు...

సాల్ట్ థెరపీ గురించి తెలియని నిజాలు...

హైదరాబాద్: సాల్ట్ థెరపీ, దీనిని హలోథెరపీ లేదా స్పెలియోథెరపీ అని కూడా పిలుస్తారు. దీనివల్ల  శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి . దీనిని ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్సగా భావిస్తారు. ఈ ఉప్పు థెరపీ ఇప్పటిదేమీ కాదు. పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూనే ఉన్నారు. జలుబు నుంచి చర్మ సంబంధిత సమస్యలకు సరైన పరిష్కారంగా చెబుతారు. పోలాండ్ కు చెందిన వైద్యుడు బోస్కో విన్ స్కీ తొలి సారిగా 1843 లో ఉప్పు గుహల ఆరోగ్య ప్రయోజనాలను గురించి పరిశోధనలు చేశాడు.  పోలాండ్ లోని వెల్కిజ్ కా నగరంలోని  ఉప్పు గనుల్లో అనేక ప్రయోగాలు చేసాడు. ఉప్పు థెరపీతో ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు.

సహజసిద్ధమైన ఉప్పు రోగనిరోధకశక్తి  పెంచడమే కాకుండా , శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి ఉపకరిస్తుందని బోస్కో విన్ స్కీ తేల్చాడు. ఉప్పు చికిత్స శాస్త్రీయపరంగా  ఎలా పనిచేస్తుందనే విషయాల పై చాలా ఆధారాలను చూపించాడు. వాటిని చుసిన విమర్శకులు సైతం బోస్కో విన్ స్కీ ని ప్రశంసించారు. మందుల అవసరాన్ని తగ్గిస్తూ ఉబ్బసం ఉన్న పిల్లలకు మంచి చికిత్సగా ఈ ఉప్పు థెరపీని యురోపీయన్లు  భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ చికిత్సల మాదిరిగా దీనిని ఉపయోగిస్తారు.  ఉప్పు చికిత్స అనేది సహజమైన ఉప్పు గుహల్లో ఆరోగ్య సమయాన్ని గడిపే తూర్పు యూరోపియన్ ల సాంప్రదాయం. అక్కడ సాంప్రదాయ వైద్యంగా భావిస్తూ నేటికీ విస్తృతంగా ఈ థెరపీని వినియోగిస్తున్నారు.






భారత దేశంలో ఆయుర్వేదానికి ఎంతటి ఘనత ఉన్నదో అక్కడ కూడా  ఉప్పు థెరపీకి అంతటి ప్రాధాన్యత ఉన్నది. సాల్ట్ థెరపీ సెంటర్లు అచ్ఛం బ్యూటీ పార్లర్ లను తలపిస్తుంటాయి. ఆధునిక ఉప్పు గదులు సహజ ఉప్పు గనులను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా చిన్నారుల్లో వచ్చే శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి పురాతన కాలం నుంచి  ఇదే విధానాన్ని అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నారు.  ఉప్పు గదులు స్థిరమైన ఉష్ణోగ్రత ,తేమ కలిగి ఉంటాయి. లోపలి గోడలు స్వచ్ఛమైన ఉప్పుతో కప్పి ఉంటాయి, క్రిములు, కీటకాలు లోపలి ప్రవేశించడానికి అవకాశం ఉండదు. 

ఉప్పు గుహల్లో  విశ్రాంతి తీసుకునేటప్పుడు, 1 నుంచి 10 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉప్పు సూక్ష్మ కణాలు గదిలోకి విడుదలవుతాయి. శ్వాస, ముక్కు, గొంతు ,పిరితిత్తులలోకి ప్రవేశించి వైద్యం ప్రక్రియను ప్రారంభిస్తారు. 5 మైక్రోమీటర్ల కంటే పెద్ద కణాలు ముక్కు ,గొంతులోకి  వెళతాయి. చిన్న కణాలుపిరితిత్తులోకి చొచ్చుకుపోతాయి. దీనివల్ల అలెర్జీలు, ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు , ఫ్లూ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎంఫిసెమా,  రినిటిస్, ముక్కు సంబంధిత ఇన్ఫెక్షన్లు , సైనసిటిస్ వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఉప్పు గదులు ఎంతో బాగా ఉపయోగపడుతాయి. చెవి ఇన్ఫెక్షన్లు ,తామర, సోరియాసిస్ వంటి చర్మ రోగాలకు సాల్ట్ థెరపీ ప్రభావవంతంగా పనిచేస్తుంది.


logo