సోమవారం 01 జూన్ 2020
National - May 22, 2020 , 23:30:58

టిటిడి ఆన్ లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు

 టిటిడి ఆన్ లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రకటన జారీ చేసింది. స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వ సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు టిటిడి అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితసేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర ఆన్‌లైన్ సేవలను బుక్ చేసుకోవడంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చనున్నట్టు టీటీడీ  అధికారులు తెలిపారు. మార్పు చేసిన వెబ్‌సైట్ రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.  

 


logo