గురువారం 04 జూన్ 2020
National - May 22, 2020 , 22:42:03

1400మంది ఉద్యోగులను తొలగించిన ఓలా

1400మంది ఉద్యోగులను తొలగించిన ఓలా


ముంబై : కరోనా సెగ అన్ని రంగాలపైనా తీవ్రంగా పడుతున్నది. క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ల కూ ఆ సమస్య తప్పడం లేదు. ఆ జాబితాలో ఓలా సంస్థ చేరింది. దీంతో ఓలా క్యాబ్ సర్వీసెస్ దేశంలో 1400మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఓలా అన్ని విభాగాల్లో 1400మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లో ఆదాయం 95 శాతం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ 1400 మందికి ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపినట్లు ఓలా సీఈఓ భవష్ అగర్వాల్ తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల వేతనం ఇవ్వడంతోపాటు..ఏడాది చివరి వరకూ మెడికల్ క్లెయిన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు వర్తిస్తాయని ఓలా ప్రకటించింది.


logo