శనివారం 30 మే 2020
National - May 22, 2020 , 22:27:55

లాభాల బాటలో పేటీఎం

  లాభాల బాటలో పేటీఎం


బెంగళూరు : కరోనా నేపథ్యంలో నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరగడంతో  పేటీఎం లాభాల బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారుల కోసం వచ్చిన పేటీఎం.. లెడ్జర్ సర్వీస్‌లోనూ ముందున్నది. సుమారు 15 వందల కోట్ల రూపాయల విలువ గల చెల్లింపులను.. వినియోగదారుల నుంచి వ్యాపారులకు వచ్చినట్టు పేటీఎం సంస్థ తాజాగా ప్రకటించింది. 2020 జనవరిలో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌లో.. ఆ నెల 8 నుంచి మార్చి14 వరకూ జరిగిన చెల్లింపులను చూస్తే.. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఇప్పటివరకూ.. నాలుగు రెట్లు పెరిగినట్టు తెలిసింది. ఈ బిజినెస్ ఖాతాను కిరాణా స్టోర్స్ దుకాణాదారులు, ఆటోమొబైల్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారు కూడా ఎక్కువగా వాడుతున్నారు. పేటీఎం వల్ల మరో ఉపయోగమేంటంటే. సరుకును అప్పుగా తీసుకెళ్లినా.. ఆ లావాదేవీలను వ్యాపారులు బిజినెస్ ఖాతాలో నమోదు చేసుకుంటారు. గడువు ముగియగానే వినియోగదారులకు మెసేజ్ రూపంలో రిమైండర్ వెళ్తుంది. దీంతో ప్రత్యేకంగా గుర్తుచేసే పని లేకుండా వ్యాపారులు సులభంగా వసూళ్లు చేసుకోగలుగుతున్నారు. కాగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా వ్యాపారులు పేటీఎం సేవలను వినియోగిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది.  


logo