శుక్రవారం 05 జూన్ 2020
National - May 22, 2020 , 19:34:39

పెండ్లి కూతురికి కరోనా... 32 మంది క్వారంటైన్ కు...

 పెండ్లి కూతురికి కరోనా... 32 మంది క్వారంటైన్ కు...


భోపాల్: పెండ్లైన రెండో రోజే పెండ్లి కూతురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో  పెండ్లికి హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలించారు. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని జట్ ఖేదీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, రైజన్‌ జిల్లాలోని సత్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. ఈ పెండ్లికి 32 మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడు, పురోహితుడు సహా.. అందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు.  వారు కాంటాక్ట్ అయిన వారిని తెలుసుకునే పనిలో పడ్డారు.  గత వారం ఆ మహిళ జ్వరంతో బాధపడగా.. దానికి సంబంధించిన మందులను వాడింది. ఈ క్రమంలో ఆమెకు జ్వరం తగ్గినప్పటికీ.. ఆమె కుటుంబసభ్యులు శనివారం కరోనా పరీక్షను చేయించారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  


logo