శనివారం 30 మే 2020
National - May 22, 2020 , 00:48:35

ఐటి రంగంలో కొత్త ఉద్యోగాల లేకపోవచ్చు....కారణం ఇదే ...

ఐటి రంగంలో కొత్త ఉద్యోగాల లేకపోవచ్చు....కారణం ఇదే ...

బెంగళూరు : ఈ ఏడాది ఐటి రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఉండకపోవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టివి మోహన్‌దాస్‌ పాయ్‌ అన్నారు. కరోనా ప్రతికూల ప్రభావమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే హామీ ఇచ్చిన వారికి మాత్రం ఆయా సంస్థలు నియామకాలు కల్పించనున్నాయన్నారు. ఐటి కంపెనీల క్లయింట్లు కూడా చాలా వరకు తమ కార్యాలయాలను తెరవలేదన్నారు. దీంతో వచ్చే రెండు మూడు త్రైమాసికల వరకు ఎటువంటి నియామాకాలు జరగబోవని చెప్పారు. ఒక వేళ ఎవరైనా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ స్థానాన్ని భర్తి చేయకపోవచ్చని పాయ్‌ పేర్కొన్నారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 20-25 శాతం కోత ఉండొచ్చన్నారు. ఇక ఉద్యోగంలో పదోన్నతి ఉన్నప్పటికీ జీతాల పెంపు మాత్రం ఉండకపోవచ్చన్నారు. లాక్‌డౌన్‌తో ఐటి పరిశ్రమలోని 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల ఇళ్లలో మౌలిక సదుపాయల కల్పన, ఆయా కంపెనీల క్లయింట్ల నుంచి భద్రతాపరమైన అనుమతి లభించడంతో ఇంటి నుంచే పని విజయవంతంగా కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని కోరనున్నా యన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ 25 నుంచి 30 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచే పనికి అనుమతించే అవకాశాలున్నా య్నారు. దీంతో మిగిలిన సిబ్బందితో కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.  


logo