బుధవారం 27 మే 2020
National - May 22, 2020 , 00:39:23

నెట్‌ ఫ్లిక్స్‌లో నిర్భయ వెబ్ సిరీస్

 నెట్‌ ఫ్లిక్స్‌లో నిర్భయ వెబ్ సిరీస్

హైదరాబాద్:  నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ ఉదంతం దేశంలో ఎంత సంచలనం రేపిందో.. దేశాన్ని ఎంతగా కుదిపేసిందో అందరికి తెలిసిందే.. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని, ఉరితీయాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. యువత మొత్తం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో దేశం ఓ కుదుపునకు గురైంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కుండా ఉండేందుకు నిర్భయ పేరుతో ఓ చట్టమే తెచ్చారంటే ఈ ఉదంతం ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు ఉరి శిక్ష అమలు చేయడంలో ఎంత ఆలస్యం జరిగిందో.. నిర్భయ తల్లిదండ్రులు మానసికంగా ఎంత వేదన అనుభవించారో అందరికీ తెలిసిందే.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఉరిశిక్ష కొన్ని నెలల క్రితం ఎట్టకేలకు అమలైంది. యావత్‌ భారతదేశంపై ఎంతో ప్రభావం చూపిన ఈ కేసుపై సమగ్ర అధ్యయనంతో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. అదే 'ఢిల్లీ క్రైమ్‌'... నెట్‌ ఫ్లిక్స్‌లో తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ను లాంచ్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ మొత్తం నిర్భయ ఘటనపైనే ఉంటుంది. డిసెంబర్‌ 16న రాత్రి నిర్భయపై దారుణం జరగడానికి ముందు ఉన్న పరిస్థితులేంటి? ఘటన జరిగిన తరువాత దేశంలో చెలరేగిన అలజడులు, పోలీసులు నిందితులను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు, అరెస్టు అయిన తరువాత ఉరిశిక్ష అమలు కాలయాపనకు గల కారణాలు, అనంతరం ఉరిశిక్ష అమలు, ఈ విషయంలో రాజకీయ జోక్యం ఏమిటి? తదితర అంశాలన్నింటినీ జోడించి వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్‌లో చూసిన వారు రివ్యూలు కూడా ఇస్తున్నారు. కథ మొత్తం ఉత్కంఠభరితంగా సాగుతుందని చెబుతున్నారు.
logo