శుక్రవారం 05 జూన్ 2020
National - May 22, 2020 , 00:28:33

ఉచిత కూరగాయల మార్కెట్

ఉచిత కూరగాయల మార్కెట్


కోల్ కతా : కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను స్తంభింపచేసింది. లాక్ డౌన్ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక చాలామంది వారు పొదుపు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. చాలామంది ఆర్ధికంగా నానాఅగచాట్లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అవసరమైన వారికి సహాయపడటానికి తమ వంతు ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. పశ్చిమ బెంగాల్ ల్లోని  జాదవ్‌పూర్ పరిసరాల ప్రజలు ఇప్పుడదే చేస్తున్నారు. అవసరార్థుల కోసం ఉచిత కూరగాయల మార్కెట్ ను సిపిఐఎం జాదవ్‌పూర్ ఏరియా కమిటీ ప్రారంభించింది. దీనికి కొంతమంది వాలంటీర్లు తోడయ్యారు. అవసరమైన వారు ఉచితంగా కూరగాయలను తీసుకెళ్లొచ్చు. అలాగే, వలసకూలీల కోసం కమ్యూనిటీ కిచెన్ ను కూడా ప్రారంభించారు. 


logo