గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 00:19:26

"పాతాళ లోక్" పై ప్రశంసల జల్లు కురిపించిన ప్రముఖ యాంకర్

హైదరాబాద్:  ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో పాతాళ లోక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.విరాట్ కోహ్లి భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోణం లో సాగుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా విరాట్ కోహ్లి కూడా తన భార్య చేసిన వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన కథ, కథనంతో తెరకెక్కించారని కితాబు ఇచ్చారు.ఇక బాలీవుడ్ ప్రముఖులు ఈ వెబ్ సిరీస్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మే 15న విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తున్నది. ఈ సిరీస్ పై తెలుగు యాంకర్ అనసూయ ప్రశంసలు కురిపించింది. 'పాతాళ్ లోక్' అద్బుతమైన సిరీస్ అని... ఇప్పటి వరకు తాను చూసిన వాటిలో ఇదే తన ఫేవరెట్ అని తెలిపింది.నటీనటుల నటన, మేకింగ్ అన్నీ అదిరిపోయాయని అనసూయ పేర్కొన్నది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్ అని తాను అనుకుంటున్నానని చెప్పింది.


logo